గ్రే చిత్రంలో షణ్ముఖ ప్రియ పాడిన పాటను విడుద‌ల చేసిన త‌మ‌న్..!

అరవింద్‌ కృష్ణ, అలీ రెజా, ఊర్వశి రాయ్, ప్రతాప్ పోతన్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం “గ్రే(GREY)”. రాజ్ మదిరాజు దర్శకత్వంలో కిరణ్ కాళ్లకూరి, మాధురి కాళ్లకూరి నిర్మించారు. అయితే ఈ చిత్రంలో ఇండియన్ ఐడిల్ ఫేమ్ షణ్ముఖ ప్రియ పాడిన పాటను వాలెంటైన్స్ డే సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ విడుద‌ల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పాటకు నాగరాజు తాళ్ళూరి స్వరరచన చేశారు.

బ్లాక్ అండ్ వైట్‌లో రూపొందిన సినిమా అనే వాస్తవాన్ని నిజం చేసేందుకు టీమ్ అన్ని ప్రమోషన్‌ల కోసం బ్లాక్ అండ్ వైట్ థీమ్‌ను ఎంచుకుంది. 4 దశాబ్దాల తర్వాత రూపొందుతున్న తొలి బ్లాక్ అండ్ వైట్ సినిమా గ్రే. ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులు ఒక ప్రత్యేక అనుభూతిని పొందేందుకు సిద్ధంగా ఉన్నారని మేము ఖచ్చితంగా అనుకుంటున్నామని దర్శక నిర్మాత‌లు తెలిపారు..