గ్రే చిత్రం నుండి ఇండియ‌న్ ఐడ‌ల్ ఫేమ్ షణ్ముఖ ప్రియ పాడిన పాట విడుద‌ల చేసిన సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్ త‌మ‌న్…

ఈ వాలెంటైన్స్ డే మూడ్‌ను కొన‌సాగించ‌డానికి `గ్రే(GREY)` చిత్ర బృందం ఇండియన్ ఐడల్ ఫేమ్ షణ్ముఖ ప్రియ పాడిన పాట‌ను రిలీజ్‌ చేసింది. నాగరాజు తాళ్లూరి ఈ పాట‌ను స్వరపరిచారు. ఈ పాటను సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ రోజు ఉదయం 10.10గంటలకు విడుద‌ల చేశారు.

రాజ్ మదిరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అద్వితీయ మూవీస్ నిర్మించింది. అరవింద్‌ కృష్ణ, అలీ రెజా, ఊర్వశి రాయ్, ప్రతాప్ పోతన్ ప్రధాన పాత్రలలో నటించారు.