గ్రే మూవీ ట్రైలర్ విడుదల

ప్ర‌తాప్ పోత‌న్‌, అర‌వింద్ కృష్ణ‌, అలీ రెజా, ఊర్వ‌శీరాయ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో అద్వితీయ మూవీస్ ప్రై.లి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రూపొందిన‌ చిత్రం గ్రే. స్పై థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రానికి రాజ్‌ మ‌దిరాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కిరణ్ కాళ్లకూరి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ద స్పై హూ ల‌వ్డ్ మి అనే ట్యాగ్‌లైన్ తో తెర‌కెక్కిన ఈ మూవీ త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్ర‌మోషన్స్‌లో భాగంగా గ్రే మూవీ ట్రైల‌ర్‌ను హైద‌రాబాద్‌లో జ‌రుగుతున్న ఎలైట్ ప్రో బాస్కెట్‌బాల్ లీగ్ లో రిలీజ్ చేశారు.

ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు రాజ్ మ‌దిరాజు మాట్లాడుతూ.. దాదాపు నాలుగు ద‌శాబ్ధాల త‌ర్వాత బ్లాక్ అండ్ వైట్‌లో రూపొందిన చిత్రం గ్రే అని. .ఈ ట్రైల‌ర్ అంద‌రికీ న‌చ్చుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. సినిమా చాలా బాగా వ‌చ్చిందన్నారు. తనకు ఎంతో స‌పోర్ట్ అందించిన హీరో అర‌వింద్ కృష్ణ‌కు థ్యాంక్స్‌ చెప్పారు. ఇలాంటి సినిమాల‌కు మీడియా స‌పోర్ట్ ఎంతో అవ‌స‌రమని… త‌ప్ప‌కుండా అంద‌రి స‌పోర్ట్ ఉంటుంద‌ని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.