గ్రే లో ఇండియ‌న్ ఐడ‌ల్ షణ్ముఖ ప్రియ పాడిన పాట

Song sung by Indian Idol Shanmukha Priya in Gray movie గ్రే లో ఇండియ‌న్ ఐడ‌ల్ షణ్ముఖ ప్రియ పాడిన పాట

ఈ వాలెంటైన్స్ డే మూడ్‌ను కొన‌సాగించ‌డానికి గ్రే(GREY) చిత్ర బృందం ఇండియన్ ఐడల్ ఫేమ్ షణ్ముఖ ప్రియ పాడిన పాట‌ను రిలీజ్‌ చేసింది. నాగరాజు తాళ్లూరి ఈ పాట‌ను స్వరపరిచారు. ఈ పాటను సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ రోజు ఉదయం 10.10గంటలకు విడుద‌ల చేశారు.

రాజ్ మదిరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అద్వితీయ మూవీస్ నిర్మించింది. అరవింద్‌ కృష్ణ, అలీ రెజా, ఊర్వశి రాయ్, ప్రతాప్ పోతన్ ప్రధాన పాత్రలలో నటించారు.

గ్రే అనేది బ్లాక్ అండ్ వైట్‌లో రూపొందిన సినిమా అనే వాస్తవాన్ని నిజం చేసేందుకు టీమ్ అన్ని ప్రమోషన్‌ల కోసం బ్లాక్ అండ్ వైట్ థీమ్‌ను ఎంచుకుంది. 4 దశాబ్దాల తర్వాత రూపొందుతున్న తొలి బ్లాక్ అండ్ వైట్ సినిమా గ్రే.