Grey Movie : మనదేశంలో గడిచిన ఐదారేళ్లల్లో దాదాపు రెండు సంవత్సరాల కాలంలోనే 12 మంది న్యూక్లియర్ సైంటిస్టులు కనపడకుండా పోయారు. గతంలో కూడా ఇలా ఎన్నో సార్లు జరిగాయి. వీటన్నింటికి కారణం ఫారెన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సిస్. వారంతా వలపన్నీ చేసిన ఆపరేషన్స్ ఇవి.
అయితే వాటి సంఘటనల నుంచి పుట్టిన ఐడియానే గ్రే సినిమా అని దర్శకుడు రాజ్ మదిరాజ్ అన్నారు. ఈ చిత్రానికి అతడు దర్శకుడిగా చేస్తున్నాడు. అతడు విలేకరులతో మాట్లాడుతూ కొన్ని విషయాలను పంచుకున్నాడు. మంచిని సాధారణంగా మనం తెలుపుతో.. చెడును నలపుతో పోల్చుకుంటాం. కానీ ఈ రెండు రంగుల మధ్య ఎన్నో రంగులు ఉంటాయి.