నాలుగు ద‌శాబ్ధాల త‌ర్వాత బ్లాక్ అండ్ వైట్‌ `గ్రే` మూవీ

ప్ర‌తాప్ పోత‌న్‌, అర‌వింద్ కృష్ణ‌, అలీ రెజా, ఊర్వ‌శీరాయ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో రూపొందిన‌ చిత్రం గ్రే. స్పై థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రానికి రాజ్‌ మ‌దిరాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ మూవీ ట్రైల‌ర్‌ను హైద‌రాబాద్‌లో జ‌రుగుతున్న ఎలైట్ ప్రో బాస్కెట్‌బాల్ లీగ్ లో రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ.. దాదాపు నాలుగు ద‌శాబ్ధాల త‌ర్వాత బ్లాక్ అండ్ వైట్‌లో రూపొందిన చిత్రం గ్రే అని తెలియ‌జేయ‌డానికి మా టీమ్ అంద‌రం ఎంతో గ‌ర్విస్తున్నాము. సినిమా చాలా బాగా వ‌చ్చింది. నాకు ఎంతో స‌పోర్ట్ అందించిన మా హీరో అర‌వింద్ కృష్ణ‌కి థ్యాంక్స్‌… ఇలాంటి సినిమాల‌కు మీడియా స‌పోర్ట్ ఎంతో అవ‌స‌రం. త‌ప్ప‌కుండా మీ అంద‌రి స‌పోర్ట్ ఉంటుంద‌ని ఆశిస్తున్నాను అన్నారు.

హీరో అర‌వింద్ కృష్ణ మాట్లాడుతూ నాకు యాక్టింగ్ మ‌రియు బాస్కెట్ బాల్ అంటే ఎంతో ఇష్టం. నేను న‌టించిన గ్రే సినిమా ట్రైల‌ర్ ఎలైట్ ప్రో బాస్కెట్‌బాల్ లీగ్‌లో రిలీజ్ చేయ‌డం చాలా హ్యాపీగా ఉంది. గ్రే నాకు చాలా స్పెష‌ల్ ఫిలిం. ఋషి సినిమా వ‌చ్చిన ప‌దేళ్ల‌ త‌ర్వాత రాజ్ మ‌దిరాజు గారితో మ‌రోసారి వ‌ర్క్ చేయ‌డం సంతోషంగా ఉంది. గ్రే ఒక అద్భుత‌మైన సినిమా త‌ప్ప‌కుండా మీ అంద‌రికీ న‌చ్చుతుంది.