బ్లాక్ అండ్ వైట్ స్పై ఫిల్మ్ గ్రే.. 40 ఏళ్ల తర్వాత అద్భుత ప్రయోగం?

Gray: ప్రతాప్‌ పోతన్‌, అరవింద్‌ కృష్ణ, అలీ రెజా, ఊర్వశీరాయ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘గ్రే. రాజ్ మదిరాజు దర్శకత్వంలో కిరణ్ కాళ్లకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చిత్ర యూనిట్ సందడి చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు రాజ్ మదిరాజ్ మాట్లాడుతూ… గతంలో మనదేశంలో 12 మంది అణుశాస్త్రవేత్తలు అదృశ్యమయ్యారని, వారిని కనిపెట్టడానికి ఫారెన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సిస్ ఇన్వెస్టిగేషన్ చేశాయని ఆయన అన్నారు. ఆ ఘటనల నుంచి పుట్టిందే మా ఈ గ్రే చిత్రం అని ఆయన స్పష్టం చేశారు.

మనలో చాలా మంది మంచిని తెలుపు గానూ, చెడును నలుపుగానూ చూస్తుంటామన్న ఆయన, ఆ రెండు కలర్స్‌ మధ్యలో కూడా వేరే రంగుల షేడ్స్ ఉంటాయని రాజ్ అన్నారు. మనలో పుట్టే ప్రతీ ఆలోచన వెనక ఎవరూ ఊహించని వింతైన ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయని.. అలాంటి కథాంశాన్ని ఆధారంగా తీసుకొని ఒక స్పై డ్రామాగా తెరకెక్కించిన చిత్రమే ఈ గ్రే అని ఆయన తెలిపారు.