ప్రతాప్ పోతన్, అరవింద్ కృష్ణ, అలీ రెజా, ఊర్వశీరాయ్ ప్రధాన పాత్రల్లో అద్వితీయ మూవీస్ ప్రై.లి పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న చిత్రం గ్రే
. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి రాజ్ మదిరాజు దర్శకత్వం వహిస్తున్నారు. కిరణ్ కాళ్లకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ద స్పై హూ లవ్డ్ మి అనే ట్యాగ్‌లైన్ తో తెరకెక్కిన ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో..
రాజ్ మదిరాజ్ మాట్లాడుతూ – “ఐదారేళ్ల క్రితం మనదేశంలో రెండేళ్ల వ్యవధిలో దాదాపు 12మంది న్యూక్లియర్ సైంటిస్టులు కనపడకుండా పోయారు. ఇలా గతంలో కూడా చాలా సార్లు జరిగింది. వీటన్నింటికి కారణం ఏంటంటే ఫారెన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సిస్. వారు చాలా జాగ్రత్తగా వలపన్ని చేసిన ఆపరేషన్స్ అవన్ని. అందులోనుండి పుట్టిన ఐడియానే గ్రే మూవీ..మనం సాధారణంగా మంచిని తెలుపుగాను, చెడును నలుపుగాను చూస్తుంటాం.