`గ్రే` మూవీ ట్రైల‌ర్ రిలీజ్

ప్ర‌తాప్ పోత‌న్‌, అర‌వింద్ కృష్ణ‌, అలీ రెజా, ఊర్వ‌శీరాయ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో అద్వితీయ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప‌తాకంపై తెరకెక్కుతున్న చిత్రం గ్రే. స్పై థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రానికి రాజ్‌ మ‌దిరాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కిరణ్ కాళ్లకూరి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ద స్పై హూ ల‌వ్డ్ మి అనే ట్యాగ్‌లైన్ తో తెర‌కెక్కిన ఈ మూవీ త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్ర‌మోషన్స్‌లో భాగంగా ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. హైద‌రాబాద్‌లో జ‌రుగుతున్న ఎలైట్ ప్రో బాస్కెట్‌బాల్ లీగ్ లో ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.