Grey Movie: స్పై థ్రిల్లర్ గా ‘గ్రే’ సినిమా.. నలభై ఏళ్ళ తర్వాత బ్లాక్ అండ్ వైట్ సినిమా!

Grey Movie: అలీ రెజా ఈ పేరుని తప్పక ప్రతి ఒక్కరూ వినే ఉంటారు. సీరియల్స్ ద్వారా పరిచయం. దాని తర్వాత బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా వచ్చి ప్రేక్షకుల అభిమానాన్ని తన సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఈ అలీ రెజా దాదాపు నలభై ఏళ్ళ తర్వాత వస్తున్న బ్లాక్ అండ్ వైట్ సినిమా ‘గ్రే’ లో హీరోగా నటించబోతున్నారట.

ఇక ఈ సినిమా గురించిన వివరాల్లోకి వస్తే అలీ రెజా, ప్రతాప్ పోతన్, అరవింద్ కృష్ణ, ఊర్వశీ రాయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా అద్వితీయ మూవీస్ ప్రై లి పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1 గా రూపొందుతుంది ఈ చిత్రం. ఈ చిత్రానికి రాజ్ మాదిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాతగా కిరణ్ కాళ్లకూరి తెరకెక్కిస్తున్న ద స్పై హూ లవ్డ్ మి అనే ట్యాగ్ లైన్ తో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.