Grey Movie: స్పై థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న గ్రే సినిమా…!

ఇటీవల కాలంలో చాలా సినిమాలు చాలా ఆసక్తికరమైన కథనంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ తరహాలోనే స్పై థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ‘గ్రే’ సినిమా కూడా ప్రేక్షకులను అలరించబోతోంది.ఈ చిత్రానికి రాజ్‌ మ‌దిరాజు ద‌ర్శ‌క‌త్వం వహించగా..కిరణ్ కాళ్లకూరి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఎంతో ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో ప్ర‌తాప్ పోత‌న్‌, అర‌వింద్ కృష్ణ‌, అలీ రెజా, ఊర్వ‌శీరాయ్ ప్ర‌ధాన పాత్రల్లో నటిస్తున్నారు. అద్వితీయ మూవీస్ ప్రై.లి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రూపొందుతున్న ఈ సినిమా స్పై త్రిల్లర్ గా తెరకెక్కుతోంది.